ఒరిస్సా రాష్ట్రంలో పంట పొలంలో ఏకంగా 19 అడుగుల కొండ చిలువ కనిపించింది. దీన్ని చూసిన స్థానిక రైతులు బెంబేలెత్తిపోయారు. ఆ తర్వాత తేరుకుని అసలు విషయాన్ని స్థానిక అటవీశాఖ అధికారులకు చేరవేయడంతో వారు వచ్చి ఆ కొండ చిలువను పట్టుకుని, అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వివరాలను పరిశీలిస్తే, ఒరిస్సాలోని కేంద్రపడ జిల్లా రాజేంద్ర నారాయణపూర్ గ్రామం శివారులోని పంట పొలంలో శనివారం నాడు ఈ కొండ చిలువను గుర్తించిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో అక్కడికి వచ్చిన అధికారులు, సిబ్బంది కొండ చిలువను చాకచక్యంగా బోనులో బంధించారు. అయితే, కొండ చిలువను బోనులో బంధించే క్రమంలో దానికి స్వల్ప గాయాలైనట్టు అధికారులు తెలిపారు. దీంతో ఆ కొండ చిలువకు చికిత్స చేసి, ఆ తర్వాత దట్టమైన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలినట్టు వారు తెలిపారు.
వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో ఆదివారం రాత్రి 11.20 గంటలకు ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయితో కలిసి ఆమె ఏడు అడుగులు నడిచారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు సమాచారం.
రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్ ఈ పెళ్లి ఘట్టానికి వేదికగా నిలిచింది. పెళ్ళి ఫోటోలు మాత్రం రెండు కుటుంబ సభ్యులు ఇంకా విడుదల చేయలేదు. కాగా, మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో పీవీ సింధు కపుల్స్ రిసెప్షన్ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా, ఈ వేడుకకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు.