Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

deadbody

ఠాగూర్

, బుధవారం, 27 నవంబరు 2024 (22:42 IST)
సరోగసీ ఆపరేషన్ కోసం ఒరిస్సా కోసం హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చిన ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె తొమ్మిదో అంతస్తు నుంచి కిందపడటంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గంలో ఉన్న మై హోమ్ భూజా అపార్టుమెంట్‌లో ఒరిస్సాకు చెందిన రాజేశ్ బాబు (54) ఆయన భార్య... అశ్వితా సింగ్ (25) అనే మహిళను సరోగసీ కోసం హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారు. ఆమె ద్వారా తమ బిడ్డకు జన్మనివ్వాలనేది రాజేశ్ బాబు దంపతుల ఆలోచన. 
 
ఇందుకోసం సందీప్ అనే మధ్యవర్తి ద్వారా రూ.10 లక్షలకు ఒప్పందం కుదిరింది. అశ్వితా సింగ్‌ను రాజేశ్ బాబు దంపతులు తమ ఫ్లాట్‌లోనే ఉంచారు. ఆమె భర్తకు కూడా అదే అపార్టుమెంట్‌లో మరో ఫ్లాట్ ఇచ్చారు. అయితే, ఆమెను రాజేశ్ బాబు దంపతులు తమ ఫ్లాట్ దాటి బయటకు రానిచ్చేవారు కాదని తెలుస్తోంది. 
 
అంతేకాదు, అశ్వితా సింగ్‌ను కలిసేందుకు భర్తకు అనుమతి ఇచ్చేవారు కాదు! కాగా, ఆ యువతి ఇంకా గర్భవతి కాలేదు. వచ్చే నెల నుంచి సరోగసీ ప్రక్రియ మొదలుకానుంది. అంతలోనే ఆమె తొమ్మిదో అంతస్తు నుంచి పడిపోయి మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది.
 
దీనిపై అశ్వితా సింగ్ భర్త మాట్లాడుతూ, రాజేశ్ బాబు తన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడని ఆరోపించాడు. అశ్వితా సింగ్ అతడి ప్రవర్తన భరించలేక, ఆ ఫ్లాట్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి, ఆ క్రమంలోనే కిందడిపోయి మరణించి ఉంటుందని భావిస్తున్నారు. బాల్కనీకి రెండు చీరలు, ఒక దుపట్టా ముడి వేసి ఉండడాన్ని గుర్తించారు.
 
కాగా, యువతిని ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న ఆరోపణలపై పోలీసులు రాజేశ్ బాబుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నట్టు రాయదుర్గం ఎస్ఐ వెంకన్న తెలిపారు. ఒడిశా యువతి, ఆమె భర్త ఎప్పటి నుంచి ఆ అపార్టుమెంట్‌లో ఉంటున్నారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..