Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యువకుడిపై దాడి చేసిన పెద్దపులి... ఏవోబీలో కలకలం...

tiger

ఠాగూర్

, ఆదివారం, 10 నవంబరు 2024 (13:19 IST)
ఇటీవల గంజాం జిల్లా జయంతిపురంలో యువకుడిపై ఓ పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న యువకుడు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇపుడు ఈ పెద్దపులి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా సరిహద్దుల్లో సంచరిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. దీంతో సరిహద్దుల్లో కలకలం చెలరేగింది. ఈ సమాచారంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. 
 
మరోవైపు, కాశీబుగ్గ రేంజ్ అటవీశాఖ అధికారి మురళీకృష్ణ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని పలు ప్రాంతాల్లో పులిజాడ కోసం అటవీ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తుంది. అదేసమయంలో రాత్రిపూట ఒంటరిగా ఎవరూ సంచరించవద్దని, పొలాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. 
 
డోనాల్డ్ ట్రంప్ గెలిచాడనీ.. అమెరికాలో 4బి ఉద్యమం... ఏంటది?
 
అమెరికా అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ మరోమారు గెలిచారు. ఈ విజయాన్ని అనేక మంది అమెరికన్ పౌరులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా, మహిళలు అయితే, ఈ విజయాన్ని ఏమాత్రం స్వాగతించడం లేదు. దీంతో వారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నాలుగేళ్ల పాటు శృంగారంలో పాల్గొనడం, బిడ్డలను కనడం వంటి విషయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ కొరియా 4బీ ఉద్యమం స్ఫూర్తితో అమెరికా మహిళలు కూడా డేటింగ్, శృంగారం, వివాహం, పిల్లలు అనే నాలుగు అంశాలకు దూరంగా ఉండాలని కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.
 
వచ్చే నాలుగేళ్లు తాను శృంగారానికి దూరంగా ఉంటానని ఓ మహిళ పేర్కొంది. పురుషులందరూ ఓటింగ్ ద్వారా తమ హక్కులను కాలరాశారని, కాబట్టి వచ్చే నాలుగేళ్లు తమను తాకే అర్హతను కోల్పోయారని మరో మహిళ పేర్కొన్నారు. ఒక మహిళగా తనకు శారీరక స్వయంప్రతిపత్తి ముఖ్యమని, దానిపై సార్వభౌమాధికారాన్ని అమలు చేయడానికి ఇదే మార్గమని టిక్టాక్ యూజర్ ఒకరు తెలిపారు. '4బీ ఉద్యమం'లో పాల్గొనేందుకు అమెరికా మహిళలకు ఇదే మంచి సమయమని మరో మహిళ వివరించారు. డేటింగ్ యాప్లను డిలీట్ చేయాలని కోరారు.
 
ఈ '4బీ ఉద్యమం' ఏంటో ఓ సారి పరిశీలిద్దాం... ఈ ఉద్యమం దక్షిణ కొరియాలో ప్రారంభమైంది. కొరియన్ భాషలో 'బి' అనేది 'నో' అనే దానికి పొట్టిపేరు. 4 బీ అంటే నాలుగు 'నో'లు అన్నమాట. ఆ నాలుగు.. శృంగారం (బిసెక్స్యూ), డేటింగ్(బయోనే), వివాహం (బిహాన్), పురుషులతో పిల్లల్ని కనడం (బిచుల్సాన్). ఈ నాలుగింటికీ దూరంగా ఉండడమే ‘4బీ ఉద్యమం' హిడెన్ కెమెరాలు, సామాజిక సమస్యలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకపై వచ్చే తుఫానులన్నీ తీవ్ర ప్రభావం చూపుతాయి...