ఇప్పటికే మండుటెండలతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ ఓ శుభవార్త చెప్పింది. సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గుముఖం పడుతాయని ప్రకటించింది. రానున్న మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల మేరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది.
ముఖ్యంగా, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, సౌత్ యూపీ, చండీఘడ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, కచ్, ఈస్ట్ రాజస్థాన్ వెస్ట్ రాజస్థాన్, తెలంగాణ ప్రాంతాల్లో 2వ తేదీ నుంచి ఎండల తీవ్రత తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
పైగా, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాజస్థాన్‌లోని పశ్చిమ భాగం, మహారాష్ట్రలోని విదర్భ మినహా దేశంలోని మరెక్కడా వడగాలులు ఉండకవచ్చని భారత వాతావరణ శాఖ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.