Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరుబయట మలవిసర్జన చేశారని... చిన్నారులపై మూకదాడి!

Advertiesment
ఆరుబయట మలవిసర్జన చేశారని... చిన్నారులపై మూకదాడి!
, గురువారం, 26 సెప్టెంబరు 2019 (07:30 IST)
మధ్యప్రదేశ్​లో గ్రామ పంచాయతీ భవనం ముందు మలవిసర్జన చేసినందుకు ఇద్దరు చిన్నారులపై స్థానికులు మూకదాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన బాధితులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మధ్యప్రదేశ్​లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ భవనం ముందు మలవిసర్జన చేశారనే నెపంతో ఇద్దరు ఎస్సీ బాలలపై మూకదాడికి దిగారు గ్రామస్థులు. శివ్​పుర్ జిల్లా​లో జరిగిన ఈ ఘటనలో ఆ ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

శివ్​పుర్​ జిల్లా భావ్​కేది గ్రామానికి చెందిన రోషనీ(12), అవినాశ్​ (10) అనే ఇద్దరు చిన్నారులు.. ఇవాళ ఉదయం స్థానిక గ్రామ పంచాయతీ భవనం ముందు మలవిసర్జన చేశారు. అది గమనించిన గ్రామస్థులు వారిపై కన్నెర్ర చేశారు.

చిన్నపిల్లలని కూడా చూడకుండా కర్కశంగా మూక దాడి చేశారు. ఆ చిన్నారులను తీవ్రస్థాయిలో గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని.. బాధితులను జిల్లా ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనకు ఒడిగట్టిన నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతుల కోసం ప్రత్యేక యాప్