ఒంటరిగా యువతి కనిపిస్తే వదలడు.. పాపంపండి... ఎట్టకేలకు...

శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (10:55 IST)
Youth Open Kiss
అతనో కామాంధుడు. వివాహమై భార్యా, పిల్లలు కూడా ఉన్నారు. కానీ, ఒంటరిగా యువతి కనిపిస్తే వదిలిపెట్టడు. గట్టిగా పట్టుకుని ముద్దులు పెడతాడు. గట్టిగా కౌగలించుకుని తన కామవాంఛ తీర్చుకుంటాడు. అలా అతని ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. చివరకు సీసీటీవీ కెమెరాలతో అతని పాపం పండింది. పోలీసులు మఫ్టీలో మకాం వేసి... పట్టుకుని అరెస్టు చేశారు. అయితే, ఆ వ్యక్తి వేధించిన బాధిత మహిళల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదు. దీంతో కేసు ఎలా పెట్టాలో పోలీసులకు తలలు బాదుకుంటున్నారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాయ్ జుర్ హబీబర్ ఖాన్ అనే వ్యక్తి ముంబైలో వడ్రంగిగా పనిచేస్తున్నాడు. వివాహమై భార్య, పిల్లలు ఉన్నారు. ఇతనికి కామవాంఛ ఎక్కువ. దీంతో ముంబై మహానగరంలోని నిత్యం రద్దీగా ఉండే మాటుంగా రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌పై మకాం వేస్తాడు. ఈ వంతెనే అతని అడ్డా. బ్రిడ్జ్ పైకి ఒంటరిగా ఉన్న యువతి వస్తే, వదిలిపెట్టడు.
 
ఒంటరిగా కనిపించిన యువతి వద్దకు వెళ్లి, గట్టిగా కౌగిలించుకుని, ముద్దులు పెడతాడు. గట్టిగా కౌగలించుకుని తన కామవాంఛ తీర్చుకుంటాడు. ఆ యువతి తేరుకునేలోగానే, అక్కడి నుంచి పారిపోతాడు. అతని ఆగడాలు అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో మాత్రమే కనిపిస్తాయి. వీటిని చూసిన పోలీసులు, మాటువేసి, పక్కా ప్లాన్ ప్రకారం అతన్ని అరెస్టు చేశారుగానీ, ఇంతవరకూ అతని ఆగడాలపై ఒక్క యువతి కూడా ఫిర్యాదు చేయకపోవడంతో, కేసు విషయమై ఎలా ముందుకు సాగాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు.
 
తాజాగా ఓ యువతిని పట్టుకుని, ముద్దు పెట్టుకుని పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తం అయ్యాయి. దీంతో అతన్ని అరెస్టు చేసేందుకు మారు వేషాల్లో మాటువేసిన పోలీసులు, అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంతవరకూ ఒక్క బాధితురాలు కూడా తమను అతను వేధించినట్టు కేసు పెట్టలేదు. దీంతో ప్రస్తుతానికి ఓ దొంగతనం కేసులో అతన్ని అరెస్టు చేసినట్టు చెబుతున్న పోలీసులు, బాధిత మహిళలు తమ వద్దకు రావాలని కోరుతున్నారు. అతనిపై మరిన్ని కఠిన సెక్షన్ల కింద కేసు పెట్టాలంటే, ఉన్న మార్గాలపై న్యాయ నిపుణులనూ సంప్రదిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పెళ్ళయి నెలరోజులే, పొద్దస్తమానం సెల్ ఫోన్ పట్టుకు కూర్చున్న భార్య.. చంపేసిన భర్త