Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ నెలలో ఆధార్‌తో ఈ-పాన్‌

ఈ నెలలో ఆధార్‌తో ఈ-పాన్‌
, శనివారం, 8 ఫిబ్రవరి 2020 (03:38 IST)
ఆధార్‌ వివరాలు అందించడం ద్వారా ఆన్‌లైన్‌ పాన్‌ కార్డులను తక్షణమే జారీ చేసే సదుపాయాన్ని ఈ నెలలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు రెవెన్యూ సెక్రటరీ అజయ్‌ భూషణ్‌ పాండే తెలిపారు.

‘‘ఈ-పాన్‌ను అందించడానికి సంబంధించిన వ్యవస్థ సిద్ధమైంది. ఈ నెలలోనే ఇది అందుబాటులోకి వస్తుంది’’ అని ఆయన చెప్పారు.

వ్యక్తులు ఆదాయ పన్ను శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించి వారి ఆధార్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయగానే ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్‌ నెంబర్‌కు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుందని, దీని ద్వారా ఆధార్‌ వివరాల పరిశీలన జరుగుతుందని ఆయన చెప్పారు.

ఆ తర్వాత తక్షణమే పాన్‌ కేటాయింపు జరుగుతుందని, ఆ తర్వాత వ్యక్తులు తమ ఈ-పాన్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

ఈ ప్రక్రియ ద్వారా పన్ను చెల్లింపుదారులు దరఖాస్తు ఫారాలను నింపి ఆదాయ పన్ను శాఖకు సమర్పించే ఇబ్బంది తప్పుతుందని, ఇదే సమయంలో పన్ను శాఖ అధికారులు పన్ను చెల్లింపుదారుల ఇంటికి పాన్‌ కార్డులను పంపించే ప్రక్రియ సులభం అవుతుందని ఆయన వివరించారు.

ప్రభుత్వం పాన్‌-ఆధార్‌ అనుసంధానాన్ని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 30.75 కోట్లకు పైగా పాన్‌లు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. 2020 జనవరి 27 నాటికి ఇంకా 17.58 కోట్ల పాన్‌లు ఆధార్‌తో అనుసంధానం కావాల్సి ఉంది.

పాన్‌-ఆధార్‌ అనుసంధానానికి ఈ ఏడాది మార్చి 31 చివరి గడువు
ప్రతిపాదిత టాక్స్‌పేయర్‌ చార్టర్‌ గురించి పాండే మాట్లాడుతూ.. మొత్తం పన్ను చట్టాల్లో పన్ను చెల్లింపుదారుల బాధ్యత గురించి తెలియజేస్తాయని, అయితే పన్ను అడ్మినిస్ర్టేషన్‌ బాధ్యతల గురించి మాత్రం పేర్కొన్నలేదన్నారు.

ఇప్పుడు చార్టర్‌ను పన్ను అధికారి పాటించకపోతే వారికి జరిమానా విధిస్తారని తెలిపారు. విశ్వసనీయ ఆధారిత వ్యవస్థ ఉండాలన్నదే ఈ ప్రతిపాదన లక్ష్యమన్నారు.

నిజాయితీగా పన్ను చెల్లించే వారు వేధింపులకు గురికావద్దని చెప్పారు. ఆన్‌లైన్‌ ద్వారానే ఎక్కువ వరకు సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం జరుగుతోందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లంకల్లో విపరీతంగా ఇసుక తవ్వకాలు