Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎర్రకోట వద్ద భద్రతా వైఫల్యం.. డమ్మీ బాంబును గుర్తించిన భద్రతా సిబ్బంది

Advertiesment
redfort

ఠాగూర్

, మంగళవారం, 5 ఆగస్టు 2025 (09:31 IST)
ఈ నెల 15వ తేదీన దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎర్రకోటలో డమ్మీ బాంబును భద్రతా సిబ్బంది గుర్తించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఎర్రకోట వద్ద భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు ఏఐ కెమెరాలు, డ్రోన్లతో నిఘాను మరింతగా పెంచారు. 
 
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని సిద్ధమవుతున్న వేళ, చారిత్రక ఎర్రకోటలో తీవ్ర భద్రతా వైఫల్యం వెలుగులోకి రావడం ఇది చర్చనీయాంశంగా మారింది. భద్రతా సిబ్బంది అప్రమత్తతను పరీక్షించేందుకు నిర్వహించిన ఒక మాక్ డ్రిల్లో భాగంగా పెట్టిన డమ్మీ బాంబును గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.
 
ఈ నెల 15వ తేదీన జరుగనున్న స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శనివారం నాడు స్పెషల్ సెల్ బృందం ఎర్రకోట వద్ద భద్రతను పరీక్షించేందుకు ఒక మాక్ డ్రిల్ నిర్వహించింది. సాధారణ పౌరుల వలె దుస్తులు ధరించిన స్పెషల్ సెల్ సిబ్బంది, ఎవరి కంటా పడకుండా ఒక డమ్మీ పేలుడు పదార్థాన్ని కోట ప్రాంగణంలోకి తీసుకెళ్లి రహస్యంగా ఉంచారు. అయితే, ప్రధాన ద్వారం వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది దీనిని పసిగట్టలేకపోయారు.
 
ఈ విషయం బయటపడటంతో ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని సిబ్బంది నిర్లక్ష్యంగా భావించి, బాధ్యులైన ఏడుగురు కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లపై తక్షణమే చర్యలు తీసుకున్నారు. కొందరిని సస్పెండ్ చేయగా, మరికొందరిని మందలించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. "డమ్మీ బాంబును తీసుకెళ్లిన బృందం ప్రధాన ద్వారం వద్ద భద్రతా తనిఖీలను దాటుకుని లోపలికి వెళ్లింది. సిబ్బంది దీనిని గుర్తించకపోవడం వారి అప్రమత్తతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది" అని ఓ సీనియర్ పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరు జిల్లాలో హెచ్‌సిసిబి సీఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్