Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అదుపు తప్పి లోయలోకి వెళ్లిన బస్సు...తర్వాత ఏమైందంటే

కొండగట్టు బస్సు ప్రమాదం తరహాలోనే కేరళలో కూడా ఒక ప్రమాదం చోటుచేసుకుంది. కానీ అక్కడ 61 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా ఈ సారి అదృష్టవశాత్తూ ఒక జేసీబీ డ్రైవర్ సమయస్ఫూర్తితో 80 మంది ప్రయాణికుల ప్రాణాలు

అదుపు తప్పి లోయలోకి వెళ్లిన బస్సు...తర్వాత ఏమైందంటే
, మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (12:00 IST)
కొండగట్టు బస్సు ప్రమాదం తరహాలోనే కేరళలో కూడా ఒక ప్రమాదం చోటుచేసుకుంది. కానీ అక్కడ 61 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా ఈ సారి అదృష్టవశాత్తూ ఒక జేసీబీ డ్రైవర్ సమయస్ఫూర్తితో 80 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా కాపాడాడు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన ఓ బస్సు కేరళలోని రాజక్కాడ్‌కు 80 మంది ప్రయాణికులతో వెళ్తోంది. ఎరచ్చిపార వద్దకు చేరుకోగానే ఆ బస్సు అదుపు తప్పి రోడ్డు కిందకి దూసుకెళ్లింది. బస్సు లోయలోకి పడబోతున్న తరుణంలో అక్కడే పక్కన ఉన్న కపిల్ అనే వ్యక్తి తన జేసీబీని అక్కడికి తీసుకెళ్లాడు. దాన్ని ఆపరేట్ చేస్తూ జేసీబీ హ్యాండిల్‌తో ఆ బస్సును దాదాపు గంటసేపు లోయలోకి పడిపోతుండా నిలిపి పెట్టాడు. 
 
ఈ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు బస్సులోనుంచి దిగేసి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. తర్వాత బస్సును కూడా ఎంతో శ్రమపడి బయటకు లాగేసాడు. అయితే కపిల్ తన వివరాలను పంచుకోవడానికి ఇష్టపడలేదు. తనతో పాటు వచ్చిన స్నేహితుడు చేసిన ఈ మంచి పని గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసాడు. సమయస్ఫూర్తితో 80 మంది ప్రాణాలు కాపాడిన కపిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు కపిల్‌కు ధన్యవాదాలు తెలిపారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేర చరితులపై అనర్హత వేయలేం.. పార్లమెంటే అడ్డుకోవాలి : సుప్రీంకోర్టు