Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒడిశా రాజకుటుంబాన్ని తాకిన గృహ హింస కేసు.. ఎవరిచ్చారంటే?

Odisha royal family
, మంగళవారం, 16 మే 2023 (11:24 IST)
Odisha royal family
గృహ హింస కేసు ఒడిశా రాజకుటుంబాన్ని తాకింది. డెహ్రాడూన్‌లో అర్కేష్ సింగ్ డియో, కుటుంబంపై ఫిద్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అద్రిజా ఇటీవల ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)ని కలుసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు, డిజిపి ఈ కేసును డెహ్రాడూన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎఎస్‌పి)కి అప్పగించినట్లు సమాచారం.
 
బొలంగీర్ రాజకుటుంబానికి చెందిన అర్కేష్ నారాయణ్ సింగ్ డియో భార్య అద్రిజా మంజరీ సింగ్ తన భర్త, అత్తమామలపై గృహ హింస, వరకట్న హింసకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈ విషయమై డెహ్రాడూన్ పోలీస్ స్టేషన్‌లో అద్రిజా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అద్రిజా తన ఫిర్యాదులో, తన భర్త, అనంగ ఉదయ సింగ్ డియో కుమారుడు, ఒకప్పుడు సుపారీ కిల్లర్‌తో తనను అంతమొందించడానికి ప్రయత్నించాడని ఆరోపించారు.
 
"రాజకీయాల్లోకి రావాలని నేనెప్పుడూ పార్టీ టిక్కెట్ డిమాండ్ చేయలేదు. ఈ విషయంలో మీరు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కూడా అడగవచ్చు. నేను బోలంగీర్ ప్రజలకు సేవ చేశాను. రోజూ గృహహింసకు గురవుతున్న మహిళలు ఎందరో. కానీ చాలా కేసులు తెరపైకి రావడం లేదు. నేను ఆ మహిళలకు ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాను" అంటూ చెప్పారు. అలాగే తనకు ప్రాణహాని ఉందని అద్రిజా సింగ్ రక్షణ కోరారు.
 
మాజీ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మనవరాలు అయిన అద్రిజా ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో ఉత్తరాఖండ్‌లో నివసిస్తున్నారు. అయితే, ఈ విషయంలో అర్కేష్ లేదా అతని కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బజరంగ్ దళ్ పరువు నష్టం దావా : మల్లికార్జున ఖర్గేకు నోటీసు