మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫేక్ యాడ్స్‌పై ఫైర్ అయ్యారు. తన పేరు, ఫొటో, వాయిస్‌ను అనుమతి లేకుండానే వాడుకున్న ఫేక్ యాడ్స్‌కు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఒక ఔషధ కంపెనీ వారి ప్రాడక్ట్‌ను తాను ఎండార్స్ చేస్తున్నట్లు ఫేక్ ప్రకచనలను ఇస్తోందని తన ఫిర్యాదులో సచిన్ చెప్పుకొచ్చారు. దీంతో ఫేక్ యాడ్‌పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత సహాయకుడు ఫేస్‌బుక్‌లో ఒక చమురు కంపెనీ ప్రకటనను కనుగొన్నాడు. దాని ప్రమోషన్ కోసం టెండూల్కర్ చిత్రాన్ని ఉపయోగించింది. ఆ ఉత్పత్తిని ప్రముఖ అథ్లెట్ సిఫార్సు చేసిందని, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇలాంటి ప్రకటనలు కనిపించాయని పేర్కొన్నాడు.
దీంతో ముంబై పోలీస్ సైబర్ సెల్ ఈ విషయంలో ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని వివిధ సెక్షన్ల కింద, చీటింగ్ మరియు ఫోర్జరీ, ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైంది.