Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య అందంగా వుందని అమ్మేయాలనుకున్నాడు.. రూ.1.20 లక్షలకు బేరం..

కట్టుకున్న భార్య కోసం భర్త సర్వం చేకూరుస్తాడు. కానీ ఓ ప్రబుద్ధుడు మాత్రం భార్య అందంగా వుందని.. అమ్మేయబోయాడు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఆమె అందంపై వస్తున్న కామెంట్లు భరించలేక.. ఈర్ష్యతో ఆమెను చంపే

Advertiesment
Delhi
, శనివారం, 11 ఆగస్టు 2018 (17:55 IST)
కట్టుకున్న భార్య కోసం భర్త సర్వం చేకూరుస్తాడు. కానీ ఓ ప్రబుద్ధుడు మాత్రం భార్య అందంగా వుందని.. అమ్మేయబోయాడు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఆమె అందంపై వస్తున్న కామెంట్లు భరించలేక.. ఈర్ష్యతో ఆమెను చంపేయాలనుకున్నాడు. చివరికి మనసు మార్చుకుని ఆమెను ఢిల్లీలోని వ్యభిచార రొంపిలోకి తించేయాలని ప్లాన్ చేశాడు. చివరికి ఆమెను అమ్మేందుకు ప్రయత్నించాడు. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని అరారియాకు చెందిన సద్దాం(32) మొదటి భార్య, పిల్లలతో కలసి ఢిల్లీలో ఉంటున్నాడు. అయితే, మొదటి భార్య ఉండగానే మరో మహిళ (28) అందానికి ఆకర్షితుడై ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను వేరే చోట ఇల్లు తీసుకుని ఉంచాడు. ఏ అందం చూసి ఆమెను వివాహం చేసుకున్నాడో ఆమెకు ఆ అందమే శాపంగా మారింది. 
 
భార్యతో బయటకు వెళ్లినప్పుడు ఆమె అందాన్ని మగాళ్ళంతా కన్నెత్తకుండా చూసేవారు. దాన్ని పక్కనే వుండే సద్దాం భరించలేకపోయేవాడు. తర్వాత అది ఈర్ష్యగా మారింది. ఆమె అందాన్ని చూసి కొందరు కామెంట్లు కూడా చేస్తుండడంతో ఆమెపై అసూయ, ద్వేషం పెంచుకున్నాడు. దాంతో ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. 
 
ఈ నేపథ్యంలో రెండో భార్యను చంపేందుకు ఢిల్లీలోని ఓ మార్కెట్‌లో కత్తిని కొన్నాడు. కానీ ఆమెను చంపకుండా వ్యభిచార గృహానికి అమ్మేస్తే తనకు డబ్బులు కూడా వస్తాయనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా వ్యభిచార గృహాల నిర్వాహకులు, విటులను కలసి బేరసారాలు చేశాడు. చివరికి భార్యను రూ.1.20 లక్షలకు ఓ విటుడికి అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నాడు.
 
అయితే అక్కడ విటుడిగా ఉన్నది ఓ పోలీస్ ఇన్ఫార్మర్ కావడంతో అతను అధికారులకు సమాచారం అందించాడు. చివరికి రూ.10 వేల అడ్వాన్స్ తీసుకున్న సద్దాం.. భార్యకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. అక్కడ బలవంతంగా అతనికి అప్పగిస్తుండగా అప్పటికే మఫ్టీలో ఉన్న పోలీసులు నిందితుడ్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ మహిళను కాపాడారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రిటీష్ ఎయిర్‌వేస్ ఓవరాక్షన్.. రిషీ కపూర్‌ గ్లాసుడు మంచినీళ్లు అడిగితే?