Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తనకంటే చెల్లెలిపైనే తల్లికి ఎక్కువ ఇష్టం : చెల్లి పెళ్లి కోసం దాచిన నగలు అక్క చోరీ!!

arrest

ఠాగూర్

, సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (09:33 IST)
తన కంటే తన చెల్లిపైనే అమ్మకు ఎక్కువ ఇష్టమని భావించిన ఓ యువతి .. సొంత చెల్లి కోసం దాచిన బంగారు నగలను చోరీ చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సేవక్ పార్క్ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పిరశీలిస్తే, సేవక్ పార్క్ ప్రాంతానికి చెందిన కమేశ్ అనే మహిళ.. తన ఇద్దరు కుమార్తెలతో కలిసివుంటుంది. అయితే, పెద్ద కూతురు మరో ఇంటికి మారింది. కాగా, జనవరి 30న తన ఇంట్లో దొంగలు పడ్డారని గుర్తించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్షల విలువైన నగలు, రూ.25 వేల నగదు చోరీ అయినట్టు తెలిపింది. మహిళ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులకు ఆమె ఇంట్లో అనుమానాస్పదంగా ఏదీ కనిపించలేదు. తాళాలు గట్రా యధాతథంగా ఉండటంతో వారు స్థానిక సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.
 
ఈ క్రమంలో ఓ మహిళ బుర్ఖా ధరించి కమ్రేశ్ ఇంట్లోకి ప్రవేశించినట్టు గుర్తించారు. చివరకు పోలీసులు బుర్ఖాలోని మహిళను కమేశ్ పెద్ద కూతురు శ్వేతగా గుర్తించారు. శ్వేతను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆమె జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది. తల్లికి తనకంటే చెల్లెలిపైనే ఎక్కువ ఇష్టం ఉండటం తనకు ఆగ్రహం కలిగించిందని తెలిపింది. అంతేకాకుండా, తనకు అప్పులు కూడా ఉండటంతో వాటిని తీర్చేందుకు చోరీ చేశానని పేర్కొంది. 
 
దొంగతనానికి కొన్ని రోజుల ముందే ఆమె పథకం ప్రకారం, మరో ఇంటికి మారిపోయింది. కొత్త ఇంట్లో కూతురు సెటిలయ్యేందుకు తల్లి కమేశ్ పలు ఏర్పాట్లుచేసింది. చిన్న కూతురు ఆఫీసుకు వెళ్లాక పెద్ద కూతురు ఇంటికి వచ్చి వెళుతుండేది. ఈ క్రమంలో ఓ రోజు తన ఇంటికొచ్చిన తల్లి నుంచి శ్వేత ఇల్లు, కప్ బోర్డు తాళాలు దొంగిలించింది. ఆ తర్వాత కూరగాయలు కొనేందుకని చెప్పి బయటకు వచ్చిన ఆమె ఓ పబ్లిక్ టాయ్‌లెట్ బుర్ఖా ధరించి తల్లి ఇంటికెళ్లి నగలు దొంగిలించింది. నగలు, డబ్బులు పోయాయని ఆ తర్వాత తల్లి తనకు చెప్పినా శ్వేత ఏమీ తెలీనట్టు నటించింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగడంతో ఆమె నిజం ఒప్పుకోక తప్పలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ - హరీష్ రావు పాపాలు పండుతున్నాయ్ : సీఎం రేవంత్ రెడ్డి