Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్‌ వారియర్ల గౌరవార్థం దాల్మియా భారత్‌ గ్రూప్‌ సంగీత మహోత్సవం ఎలా వుందంటే?

Advertiesment
Dalmia Bharat Group
, సోమవారం, 17 ఆగస్టు 2020 (21:08 IST)
దేశంలోని కోవిడ్‌ వారియర్ల మహోన్నత స్ఫూర్తి, ధైర్యంను వేడుక చేస్తూ దాల్మియా భారత్‌ గ్రూప్‌, ఓ ఆన్‌లైన్‌ సంగీత విభావరిని జజ్బా- ఇ భారత్‌ శీర్షికన నిర్వహించింది. ఈ సంగీత విభావరిలో పద్మశ్రీ కైలాష్‌ ఖేర్‌, గ్రామీ అవార్డు గ్రహీత రికీ కేజ్‌తో పాటుగా సుప్రసిద్ధ గాయకులు ఉదిత్‌ నారాయణ్‌, బెన్నీ దయాల్‌, జోనితా గాంధీ, ఆదిత్య నారాయణ్‌ మరియు ఐపీ సింగ్‌ కూడా పాల్గొన్నారు. జజ్బా ఇ-భారత్‌ ప్రచారం భారతదేశ వ్యాప్తంగా ఒక కోటి మంది ప్రజలను ఆన్‌లైన్‌తో పాటుగా ఆఫ్‌లైన్‌లో చేరుకుంది.
 
ఈ లైవ్‌ కాన్సర్ట్‌ను దాల్మియా సిమెంట్‌ (భారత్‌) లిమిటెడ్‌ ఎండీ అండ్‌ సీఈవో శ్రీ మహేంద్ర సింగి ప్రారంభించారు. అనంతరం జాతి నిర్మాణంలో  కంపెనీ యొక్క అంకితభావం, కృషి గురించి ఆయన  వెల్లడించారు. ఈ 90 నిమిషాల సంగీత విభావరిలో సంగీత ప్రపంచంలో మహోన్నత వ్యక్తులుగా కీర్తించబడుతున్న వారు అద్వితీయమైన తమ ప్రదర్శనతో ప్రేక్షకులను సమ్మోహన పరిచారు.
 
ఈ షో ఉత్సాహపూరితమైన, హృదయానికి హత్తుకునే కైలాష్‌ ఖేర్‌ గాత్రంతో ఆరంభమైంది. సుప్రసిద్ధ హిట్‌ గీతాలైన కౌన్‌ హై వో (బాహుబలి), భారత్‌ కే వీర్‌ నేపథ్యం, సైయాన్‌, తేరీ దివానీ మరియు మరెన్నో గీతాలు ఆలపించారు. ఈయనను అనుసరించి రిక్కీకేజ్‌ అద్భుతమైన సంగీతంతో ప్రేక్షకులను సమ్మోహన పరిచారు.
 
తండ్రీకొడుకుల ద్వయం ఉదిత్‌ నారాయణ్‌ మరియు ఆదిత్య నారాయణ్‌తో పాటుగా బెన్నీ దయాల్‌, జోనితా గాంధీ లు తమ అత్యంత ప్రాచుర్యం పొందిన గీతాలను అలపించి ఈ సాయంత్రాన్ని మరుపురానిదిగా మలిచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడున్నర లక్షలకే అద్భుతమైన ఇల్లు.. ఎలా సాధ్యం?