కోవిడ్-19 మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని నరేలా ప్రాంతంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) విభాగంలో 9 మంది జవాన్లకు కరోనా వైరస్ సోకింది. కరోనా వైరస్ సోకిన జవాన్లను ఆసుపత్రిలోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
తొమ్మిది మంది జవాన్లకు కరోనా పాజిటివ్ రావడంతో ఆ విభాగంలో పనిచేస్తున్న 47 మందిని సెల్ఫ్ క్వారంటైన్ చేశారు. ఢిల్లీ నగరంలో లాక్ డౌన్ సందర్భంగా విధులు నిర్వర్తిస్తున్న సీఆర్ పీఎఫ్ జవాన్లకు కరోనా సోకడం సంచలనం రేపింది. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
ఓవైపు ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే పాక్ ఉగ్రవాదులు మాత్రం దుశ్చర్యలకు ఏమాత్రం స్వస్తి పలకడం లేదు. శనివారం ఉదయం జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు సహా వారితో సంబంధం ఉన్న మరో వ్యక్తి హతమయ్యాడు.