Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్-19 వార్డులో ఎయిమ్స్ ఢిల్లీ అధునాతన మిలాగ్రో రోబోలు

Advertiesment
కోవిడ్-19 వార్డులో ఎయిమ్స్ ఢిల్లీ అధునాతన మిలాగ్రో రోబోలు
, మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (20:04 IST)
కరోనాను అరికట్టే రోబో
భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, పెరుగుతున్న కోవిడ్ -19 కేసులతో తలమునకలై ఉండగా తన వంతు సహకారాన్ని అందించడానికి, భారతదేశ నంబర్ 1 కన్స్యూమర్ రోబోటిక్స్ బ్రాండ్ మిలాగ్రో, ఎయిమ్స్, ఢిల్లీ తన వంతు పాత్రను పోషిస్తోంది. ఈ కృషిలో భాగంగా, తన అధునాతన ఎఐ-పవర్‌తో పనిచేసే రోబోలు - మిలాగ్రో ఐమాప్ 9 మరియు హ్యూమనాయిడ్ ఇఎల్‌ఎఫ్‌లు, ఢిల్లీలోని ఎయిమ్స్ లోని అధునాతన కోవిడ్ -19 వార్డులో నేటి నుంచి ఉపయోగించి పరీక్షించబడతాయి.
 
నేలపై వున్న కోవిడ్ బీజ కణాలను నాశనం చేస్తుంది
భారతదేశంలో తయారు చేయబడిన, మిలాగ్రో ఐమాప్ 9 అనేది ఒక ఫ్లోర్ క్రిమిసంహారక రోబో, ఇది మానవ జోక్యం లేకుండానే నేవిగేట్ చేసి, నేల ఉపరితలాలను శుభ్రపరచగలదు. ఇది ఐసిఎంఆర్ సిఫారసు చేసిన విధంగా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని ఉపయోగించి నేల ఉపరితలాలపై కోవిడ్ బీజకణాలను నాశనం చేస్తుంది. రోబో క్రింద పడకుండా స్వయంచాలకంగా కదులుతుంది, లిడార్ మరియు అధునాతన స్లామ్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన దాని స్వంత మార్గంతో అడ్డంకులను అధిగమిస్తూ పనిచేస్తుంది. 
 
మిలాగ్రో యొక్క పేటెంట్ పొందిన రియల్ టైమ్ టెర్రైన్ రికగ్నిషన్ టెక్నాలజీతో 16 మీటర్ల దూరం నుంచి 8 మిమీ వరకు ఖచ్చితత్వంతో వాస్తవ సమయంలో ఫ్లోర్‌ను కలియదిరగడానికి, 360 డిగ్రీల ఏరియా మొత్తాన్ని స్కాన్ చేసి, సెకనుకు 6 సార్లు శుభ్రపరుస్తుంది. ఇది మొదటి ప్రయత్నంలో విజయవంతంగా పనిచేయడానికి ఐమ్యాప్ 9ను అనుమతిస్తుంది. అయితే ఇతర రోబోలకు వీటి కంటే రెండు లేదా మూడు రెట్ల ఎక్కువ సమయం పడుతుంది. అదనంగా, రోబోలు జోనింగ్ చేయగలవు, నివారించగల ప్రాంతాల వర్చువల్ బ్లాకింగ్ మరియు నిర్దిష్ట అవసరాల ఆధారంగా జోన్లను క్రమవారీగా శుభ్రపరచడం కూడా చేయగలవు.
 
రోగులు రోబో ద్వారా బంధువులతో సంభాషణ
మిలాగ్రో హ్యూమనాయిడ్ ఇఎల్‌‌ఎఫ్, కోవిడ్ -19 అంటువ్యాధి సోకిన రోగులను, దూరం నుండే, వ్యక్తి-వ్యక్తి- తాకకుండానే, పర్యవేక్షించడానికి మరియు సంభాషించడానికి వైద్యులకు వీలుకల్పిస్తుంది, తద్వారా అంటువ్యాధి సోకే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఐసోలేషన్ వార్డులలో ఉంటూ, విసుగు చెందిన రోగులు ఈ రోబో ద్వారా ఎప్పటికప్పుడు వారి బంధువులతో కూడా సంభాషించవచ్చు. హ్యూమనాయిడ్ ఇఎల్‌‌ఎఫ్ వార్డు చుట్టూ స్వతంత్రంగా నావిగేట్ చేయవచ్చు మరియు ఇది హై డెఫినిషన్ వీడియో మరియు ఆడియోలో కార్యకలాపాలను రికార్డ్ చేస్తుంది. 
 
8 గంటల బ్యాటరీ మన్నికను అందించే ఇది గంటకు 2.9 కిలోమీటర్లు ప్రయాణించగలదు, 92 సెం.మీ పొడవు, అరవైకి పైగా సెన్సార్లు, ఒక 3డి మరియు ఒక హెచ్‌డి కెమెరా మరియు 10.1 అంగుళాల డిస్ప్లే స్క్రీన్ కలిగి ఉంటుంది. అధునాతన హ్యూమనాయిడ్ ఫీచర్స్ భావోద్వేగం కలిగిన కళ్ళు, ఓపెన్ మరింత అభివృద్ధి మరియు అనుకూలీకరణ కోసం ఓపెన్ ఎపిఐ కలిగి ఉంటుంది. మిలాగ్రో ఐమాప్ 9 మరియు హ్యూమనాయిడ్ ఇఎల్‌‌ఎఫ్, రెండూ కూడా, ఆటో ఛార్జింగ్ ఫీచర్స్ కలిగి ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రామ, వార్డు వాలంటీర్లకు శుభవార్త!