Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తల్లికి కరోనా వుంటే.. శిశువుకు కరోనా వైరస్ సోకదు..

తల్లికి కరోనా వుంటే.. శిశువుకు కరోనా వైరస్ సోకదు..
, సోమవారం, 13 ఏప్రియల్ 2020 (17:37 IST)
తల్లికి కరోనా వుంటే.. శిశువుకు కరోనా వైరస్ రాదనేందుకు ఈ ఘటనే ఉదాహరణ. తల్లికి కరోనా వైరస్ ఉంటే బిడ్డకు వస్తుందేమో అని చాలామంది భయపడుతూ ఉంటారు. అలాంటిదేమీ లేదని.. తమిళనాడులో ఓ మహిళ నిరూపించేలా చేసింది. తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ వైద్య కళాశాల హాస్పిటల్‌లో కరోనా వైరస్ సోకిన ఓ గర్భిణి చికిత్స పొందుతున్నది. 
 
పుట్టబోయే బిడ్డకు తన వ్యాధి వస్తుందేమో అని నిరంతరం భయడుతూనే ఉన్నది. అలా రాదని వైద్యులు ధైర్యం చెబుతున్న ఆమె మనసు స్థిమితంగా లేదు. నొప్పులు రావడంతో సిజేరియన్ చేసి ఆమెకు డెలివరీ చేశారు డాక్టర్లు. ఈ క్రమంలో పండంటి మగబిడ్డకు జన్మనించింది. అంతేకాదు ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు సమాచారం అందించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. తల్లికి కొవిడ్‌-19 చికిత్స అందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ జ‌న్మ‌కిది ఇది చాలు: మెగా దంప‌తుల ప‌రామ‌ర్శ‌పై రాజ‌నాల నాగ‌ల‌క్ష్మి స్పంద‌న‌