కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో మళ్లీ పలు రంగాలు మూతపడే పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో... దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ... హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది.
దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని తయారీ యూనిట్లలోనూ వాహన తయారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. గురువారం(ఏప్రిల్ 22) నుంచి మే ఒకటి వరకు ప్రతీ మేనిట్‌లోనూ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
యూనిట్ల నిలిపివేత సమయంలో మెయింటెనెన్స్ పనులు పూర్తి చేసుకుంటామని వెల్లడించింది. కాగా... కంపెనీకి చెందిన అన్ని కార్పొరేట్ ఆఫీసులు ఇప్పటికే మూసివేసి ఉన్నాయి. ఇక... ఉద్యుగులు వర్క్‌ఫ్రం హోం ద్వారా విధులు నిర్వర్తిస్తున్నారు.
కంపెనీ వాహన తయారీ నిలుపుదల కారణంగా డిమాండ్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడబోదని హీరో కంపెనీ తెలిపింది. షట్‌డౌన్ తర్వాత ప్రతీ ప్లాంట్‌లోనూ తయారీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని వెల్లడించింది.