Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోణార్క్‌ తరహాలో అయోధ్య గుడి నిర్మాణం..?

కోణార్క్‌ తరహాలో అయోధ్య గుడి నిర్మాణం..?
, సోమవారం, 18 అక్టోబరు 2021 (20:08 IST)
అయోధ్య రాముడి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత కనువిందు చేసే విధంగా ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ కొత్త ఏర్పాట్లు చేస్తోంది. ఒడిశాలోని కోణార్క్‌, శ్రీకాకుళంలోని అరసవల్లి పుణ్య క్షేత్రాల తరహాలో గర్భగుడిలోకి సూర్య కిరణాలను ప్రసరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రస్ట్‌ సభ్యుడు కామేశ్వర్‌ చౌపాల్ తెలిపారు.

13వ శతాబ్దంలో నిర్మించిన కోణార్క్‌ ఆలయాన్ని స్ఫూర్తిగా తీసుకుని శ్రీరామ నవమి రోజు రాముని పాదాలను సూర్య కిరణాలు తాకే విధంగా గుడి నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటికే సంబంధిత పనులు జరుగుతున్నాయని కామేశ్వర్‌ చౌపాల్‌ చెప్పారు. ఇందుకోసం సైంటిస్టులు, జ్యోతిషులు, సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా దేవాలయ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టడానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) దిల్లీ, ఐఐటీ ముంబయి, ఐఐటీ రూర్కీతో సహా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే, రామమందిర నిర్మాణం వేగంగా జరుగుతోందని, 2023 డిసెంబర్‌ నాటికి భక్తులకు గుడి అందుబాటులోకి రానుందని చౌపాల్‌ చెప్పారు.

భౌగోళిక, పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వివరించారు. ముందు అనుకున్నట్లు రెండంతస్థులు కాకుండా మూడు అంతస్థుల్లో మందిర నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో మ్యూజియం, రీసెర్చ్‌సెంటర్‌, ఆడిటోరియం, గోశాల, పర్యాటక కేంద్రం, అడ్మినిస్ట్రేటివ్‌ భవనం, యోగా కేంద్రం తదితరాలు కొలువుదీరనున్నాయని వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొగ్గు కొరత రాకుండా చూడండి: జగన్‌