తమిళనాడు రాజకీయాలు మరో ఆరు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున, అన్ని ప్రముఖ పార్టీలు రంగం సిద్ధం చేస్తున్నాయి. దళపతి విజయ్ కూడా ఎన్నికలు సిద్ధం అవుతున్నారు. తాజాగా విజయ్ కాంగ్రెస్ పార్టీ నేతతో భేటీ అయ్యారని తెలుస్తోంది.
కాంగ్రెస్ పరిపాలనలో అగ్రశ్రేణి పేర్లలో ఒకరైన, రాహుల్ గాంధీకి సన్నిహితుడైన ప్రవీణ్ చక్రవర్తి శుక్రవారం దళపతి విజయ్‌ను కలిశారని తెలుస్తోంది.
కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఇప్పటికే తమిళనాడులోని తమ ప్రస్తుత భాగస్వాములైన డిఎంకె స్టాలిన్‌ను కలిసి రాబోయే ఎన్నికలకు 40 ఎమ్మెల్యే టిక్కెట్లను అభ్యర్థించిన కొద్దిసేపటికే ఈ సమావేశం జరిగింది. అయితే, స్టాలిన్ ఈ ప్రతిపాదనకు అనుకూలంగా లేరని, కాంగ్రెస్‌ను 25-30 సీట్లకే పరిమితం చేయాలని కోరుకుంటున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో శుక్రవారం రహస్య వేదికలో రాహుల్ గాంధీ సహచరుడు, దళపతి విజయ్ మధ్య జరిగిన సమావేశం తమిళనాడు రాజకీయాల్లో దృష్టిని ఆకర్షించింది. ఎన్డీఏతో విజయ్ పొత్తు కుదుర్చుకుంటారనుకున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ ప్రతినిధితో విజయ్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.