కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చోసిన ఓట్ చోరీ వ్యాఖ్యలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)పై విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు కాగా, దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయామాలా బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణకు నిరాకరించింది. దీనిపై భారత ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని పిటిషనర్‌కు అపెక్స్ కోర్టు సూచించింది. అయితే, తాను ఫిర్యాదు చేసినప్పటికీ ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. రాజకీయ అంశాలకు కోర్టులను వేదిక చేసుకోవద్దని.. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని తేల్చి చెప్పింది.
భారతీయన జనతా పార్టీ, ఎన్నికల సంఘం కలిసి దేశంలో ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దొంగిలించిన ఓట్లతో ఏర్పడిందంటూ రాహుల్ విమర్శించారు. ప్రధానమంత్రి కూడా ఓట్ల తస్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు. కొందరు పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించేందుకు ప్రజల ఓటు హక్కును దొంగిలించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఘాటు విమర్శలు చేశారు.
త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదేవిధంగా ఓట్లు దొంగలించడానికి కుట్ర పన్నుతున్నారన్నారు. మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలలో ఓట్లు చోరీ చేయడంలో ఎన్డీయే ప్రభుత్వం విజయవంతమైందని.. బిహార్‌లో మాత్రం భాజపా, ఈసీని ఒక్క ఓటు కూడా చోరీ చేయనివ్వబోమని వ్యాఖ్యానించారు. కాగా రాహుల్ చేసిన ఆరోపణలు భాజపా నేతలు, ఎన్నికల కమిషన్ అధికారులు ఖండించారు.