తమిళనాడు రాజధాని చెన్నైలో విషాదం నెలకొంది. భార్యను కాపాడబోయి భర్త మృతి చెందారు. రామనాథపురంలో భారీ వర్షాలకు ఇల్లు కూలిపోగా గర్భిణి భార్యను కాపాడిన భర్త శిథిలాల్లో చిక్కుకుని మృతి చెందారు. రామనాథపురం ఎంజీఆర్ నగర్‌కు చెందిన షణ్ముగరాజ్ (24), సంగీత భార్యాభర్తలు. భార్య నాలుగు నెలల గర్భిణి.
రామనాథపురంలో సోమవారం తెల్లవారుజామున రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది. వర్షానికి షణ్ముగరాజ్ సహా ముగ్గురి పెంకుటిళ్లు హఠాత్తుగా కూలాయి. ఈ శబ్ధం విని పైకి లేచిన షణ్ముగరాజ్ భార్య సంగీతను ఇంట్లో నుంచి బయటికి నెట్టాడు.
తను బయటకు వచ్చే లోపు ఇల్లు కప్పు కుప్పకూలింది. ఈ శిథిలాల్లో చిక్కుకుని షణ్ముగరాజ్ మృతి చెందారు. అతని మృతితో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.