Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివశక్తి పాయింట్ వయసు 370 కోట్ల సంవత్సరాలా?

Advertiesment
vikram lander

ఠాగూర్

, మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (15:32 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్లో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా 2023 ఆగస్టు 23వ చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయింది. దీంతో చంద్రుడుపై సాఫ్ట్‌ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. అలాగే, చంద్రుడుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగాను రికార్డులకెక్కింది. విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తిగా ఇస్రో నామకరణం చేసింది.
 
ఈ నేపథ్యంలో శివశక్తి ప్రాంతానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. భూమిపై జీవం ఆవిర్భవించడానికి ముందే ఈ ప్రాంతం ఆవిర్భవించినట్టు ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడి సౌత్ పోల్‌కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతానికి సంబంధించిన తొలి భౌగోళిక పటాన్ని ఇండియన్ ఫిజికల్ రీసెర్స్ ల్యాబోరేటరీ బృందం తయారు చేసింది. 
 
ఈ పటాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఇది 370 కోట్ల సంపత్సరాల పూర్వం ఏర్పడి ఉంటుందని అంచనా వేశారు. భూమిపై తొలి జీవ రూపాలు కూడా అదే సమయంలో ఆవిర్భవించాయి. భౌగోళిక మ్యాపింగ్ అనేది ఏ ప్రాథమిక ప్రక్రియ అని ల్యాబొరేటరీ బృందం పేర్కొంది. ఈ అధ్యయానికి సంబంధించిన వివరాలను సైన్స్ డైరెక్టర్ మ్యాగజైన్‌లో ప్రచురితమయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉపాధ్యాయురాలి తలపై నుంచి వెళ్లిన లారీ...