Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధం.. ఇస్రో ప్రకటన

Advertiesment
, గురువారం, 29 జూన్ 2023 (08:31 IST)
చంద్రయాన్-3 మిషన్ ప్రయోగానికి సిద్ధమని ఇస్రో ప్రకటించింది. 2019లో చంద్రయాన్ 2ను చేపట్టారు. ఈ రెండో మిషన్ విఫలమైంది. మునుపటి లోపాలను సవరించుకుని ఇప్పుడు చంద్రయాన్ 3ను ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. 
 
జూలై 12 నుండి 19 మధ్యన చంద్రయాన్ 3 ప్రయోగం వుంటుందని ఇస్రో తెలిపింది. ఇది చంద్రునిపైకి వెళ్లే భారత్ కు చెందిన అత్యంత బరువైన రాకెట్.
 
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి చంద్రునిపైకి చంద్రయాన్ 3 దూసుకెళ్లనుందన్నారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.615 కోట్లు కేటాయించింది. దీనిని జీఎస్ఎల్‌వీ మార్క్ III ద్వారా ప్రయోగిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థియేటర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి పీవీఆర్-ఐనాక్స్‌తో నెస్లే ప్రొఫెషనల్ భాగస్వామ్యం