Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెమరీ లాస్‌తో బాధపడేవారికి జియో ట్యాగ్

jiotag
, సోమవారం, 19 జూన్ 2023 (15:37 IST)
పోగొట్టుకున్న లేదా మరచిపోయిన వస్తువులను సులభంగా కనుగొనేందుకు, తిరిగి పొందేందుకు వీలుగా జియో విడుదల చేసిన JioTag పరికరానికి మంచి ప్రజాదారణ లభించింది. ఈ రోజుల్లో చాలా మంది మెమరీ లాస్‌తో బాధపడుతున్నారు. అలాంటివారు తమ కారు కీలు, మనీ పర్స్, స్మార్ట్‌ఫోన్ మొదలైనవి ఎక్కడో పెట్టి మరిచిపోతున్నారు. ఈ వస్తువులను కనుగొనడానికి చాలా సమయం పడుతుంది. ఈ సమస్యకు ముగింపు పలికేందుకు, జియో తన కొత్త పరికరమైన జియో ట్యాగ్‌ను పరిచయం చేసింది. 
 
ఈ జియోట్యాగ్ బ్లూటూత్ ద్వారా పనిచేస్తుంది. మనం తరచుగా మరచిపోయే కీలు, వాలెట్లు మొదలైన వాటిలో ఉంచినట్లయితే, మనం వాటిని ఎక్కడైనా మరచిపోయినప్పుడు వాటిని స్మార్ట్‌ఫోన్ ద్వారా ట్రాక్ చేసి కనుగొనవచ్చు. అదేవిధంగా జియోట్యాగ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ పోయినా అది దొరుకుతుంది. ఇల్లు, ఆఫీసు లోపల 20 మీటర్లు, బయట 50 మీటర్ల దూరంలో ఈ జియో ట్యాగ్ పనిచేస్తుంది. 
 
ఉదాహరణకు, మీరు రెస్టారెంట్‌లో భోజనం చేసి, మీ ఫోన్ తీసుకోకుండా వెళ్లిపోతారు. కానీ మీరు మీ షర్ట్ బ్యాగ్‌లో జియో ట్యాగ్ కలిగి ఉంటే, మీరు స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉన్నప్పుడు అది వైబ్రేట్ అవుతుంది మరియు అలర్ట్ ఇస్తుంది. జియో ట్యాగ్‌లోని బటన్‌ను నొక్కడం ద్వారా, స్మార్ట్‌ఫోన్ రింగ్ అవుతుంది మరియు స్మార్ట్‌ఫోన్‌ను కనుగొంటుంది.
 
స్మార్ట్‌ఫోన్ దొంగిలించబడిన సందర్భంలో స్మార్ట్‌ఫోన్ సిగ్నల్ చివరిగా ఎక్కడ పోయిందో కూడా ఇది ఖచ్చితమైన స్థానాన్ని అందిస్తుంది. ఇది స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ విధంగా, అనేక ప్రయోజనాలతో కూడిన ఈ జియో ట్యాగ్ పరికరం ఒక యేడాది వారంటీతో రూ.749తో అందుబాటులోకి తెచ్చింది. అదేపరికరం యాపిల్‌లో కనీసం రూ.10,000 వరకు అమ్ముడవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడులో ఎదురెదురుగా ఢీకొన్న ప్రైవేటు బస్సులు - ఐదుగురి మృతి