Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేడు బీహార్ ముఖ్యమంత్రిగా మరోమారు నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం

Advertiesment
Nara Lokesh_Chandra Babu

ఠాగూర్

, గురువారం, 20 నవంబరు 2025 (09:51 IST)
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ మరోమారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదలైంది.
 
ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఏపీ నాయకత్వానికి ఆహ్వానం అందింది. ఎన్డీఏ కూటమిలోని పక్షాల మధ్య బలమైన రాజకీయ సంబంధాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకార స్ఫూర్తికి ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 
దీంతో చంద్రబాబు, నారా లోకేశ్‌లు కలిసి పాట్నాకు వెళుతున్నారు. వీరిద్దరూ గురువారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని హెలిప్యాడ్ నుంచి బయలుదేరతారు. ఉదయం 10:20 గంటలకు పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగే ప్రమాణ స్వీకార వేదికకు చేరుకుంటారు. కార్యక్రమం ముగిశాక మధ్యాహ్నం 12:30 గంటలకు పాట్నా నుంచి తిరుగు ప్రయాణమై మధ్యాహ్నం 2:55 గంటలకు తిరిగి ఉండవల్లి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
 
బీహార్ రాష్ట్రంలో ఎన్డీయే విజయంపై చంద్రబాబు ఇప్పటికే హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వికసిత భారత్ దార్శనికతపై ప్రజలకు విశ్వాసం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. నితీశ్ కుమార్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన చంద్రబాబు, డబుల్ ఇంజిన్ సర్కారుపై బీహార్ ప్రజలు మరోసారి నమ్మకం ఉంచడం సంతోషకరమని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మావోయిస్టు పార్టీకి మరో దెబ్బ... టెక్ శంకర్ ఎన్‌కౌంటర్