Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాక్ డౌన్ కాలంలో పెట్రోల్ మోటార్ సైకిల్‌ తయారు చేసిన బాలుడు

Advertiesment
Chandigarh
Motorcycle
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్‌ విధించడంతో చాలామంది ఇంటి పట్టునే వుండిపోయారు. ఇంట్లో సమయాన్ని వృధా చేస్తూ.. టీవీలకు అతుక్కుపోయిన వారు చాలామందే వుండివుంటారు. కానీ ఓ బుడ్డోడు ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా.. ఓ బండి తయారు చేశాడు. ఖాళీగా ఉండే వారిలో కొందరికి చాలా మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా పదవ తరగతి చదివే బాలుడికి కొత్త ఐడియా వచ్చింది. 
 
లాక్‌డౌన్‌లో ఖాళీ‌గా ఉండలేక ఏకంగా ఆ బాలుడు బైక్ తయారు చేసుకుని సంచలనం సృష్టించాడు. కేంద్ర పాలిత ప్రాంతమైన ఛండీగడ్‌లో పదవ తరగతి విద్యార్థి గౌరవ్ స్క్రాప్ మెటీరియల్ ఉపయోగించి.. మోటారు సైకిల్ తయారు చేశాడు.
 
ఈ సందర్భంగా అతను మీడియాతో మాట్లాడుతూ.. తాను 3 సంవత్సరాల క్రితం స్క్రాప్ మెటీరియల్ ఉపయోగించి ఎలక్ట్రిక్ బైక్ తయారు చేశానని తెలిపాడు. కానీ అది స్పీడ్‌గా వెళ్లలేకపోవడంతో.. తాను ప్రస్తుతం పెట్రోల్ మోటార్ సైకిల్‌గా దాన్ని మార్చానని వెల్లడించాడు. అది లీటరు 80 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని వివరించాడు. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాయలసీమ, కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు