Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాయలసీమ, కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు

రాయలసీమ, కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు
, గురువారం, 3 సెప్టెంబరు 2020 (19:26 IST)
కోస్తాంధ్ర,  తమిళనాడు మధ్య బంగాళాఖాతం లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. జార్ఖండ్‌ పరిసరాల్లో మరో ఆవర్తనం ఉంది. 
 
వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. 5, 6 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
బుధవారం విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
 
మార్టూరులో 80, పమిడి, గార్లదిన్నెల్లో 70, రావినూతల, అయ్యవారిపాలెంలలో 60, కొరిసపాడు 58, బొబ్బిలి 55, విశాఖపట్నంలో 51 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఆన్‌లైన్‌ గేమ్స్, బెట్టింగులపై నిషేధం