కరోనా నేపథ్యంలో ఆదాయం పెంచేందుకు ఛత్తీస్‌గఢ్ సర్కారు నిర్ణయించింది. ఛత్తీస్‌గఢ్‌లో పెరుగుతున్న కరోనా సంక్షోభం మధ్య మద్యం ఆన్‌లైన్‌లో డెలివరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కరోనా వైరస్ కట్టడికి మద్యం షాపుల రద్దీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఆఫ్‌లైన్‌లో మద్యం విక్రయాలు కూడా కొనసాగుతాయి.
రాజధాని నగరంలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా ఆన్ లైన్ అమ్మకపు సదుపాయాన్ని ప్రారంభించాలని ఎక్సైజ్ మంత్రి కవాసీ లఖ్మా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పలు షాపులను శానిటైజ్ చేస్తున్నట్లు కవాసీ చెప్పారు. ృ