ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులు అమలు చేయడం లేదు. దీంతో ప్రభుత్వం గతంలో విమర్శలు వచ్చాయి. టీడీపీతో పాటూ నర్సాపురం ఎంపీ రఘురామ కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. దీని వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఆరోపిస్తున్నారు.
ఇప్పుడు ఏకంగా ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. దీనిపై సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి ధర్మాసనం విచారణ జరిపింది.
ఇందులో భాగంగా డిజిటల్ చెల్లింపుల నిమిత్తం కేంద్రం నిబంధనలు తీసుకొచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు.
ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం.. మద్యం తాగడానికి వచ్చే పేదలకు డిజిటల్ చెల్లింపులు అడ్డంకిగా మారుతాయని.. ఇది వారి హక్కులను హరించడమేనని వ్యాఖ్యానించింది. ఈ పిల్‌పై తదుపరి విచారణను జనవరి 4కి వాయిదా వేసింది.