పాఠశాలల్లోని క్యాంటీన్లలో జంక్ ఫుడ్, ఫాస్ట్‌పుడ్‌లను అమ్మడంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించాలని నిర్ణయించింది. జంక్ ఫుడ్‌లో కొవ్వు శాతం అధికంగా వుంటాయి. దీంతో పిల్లల్లో అజీర్తి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇంకా పొట్ట సంబంధిత రుగ్మతలకు కారణమవుతాయి.
ఇలాంటి ఆహారాన్ని చిన్నారులు తీసుకోవడం ద్వారా ఒబిసిటీ తప్పట్లేదు. ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి చిన్నారులను కాపాడేందుకు గాను.. పాఠశాలల్లోని క్యాంటీన్లలో జంక్ ఫుడ్‌ను అమ్మేందుకు నిషేధం విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
పాఠశాల క్యాంటీన్లలో జంక్ ఫుడ్‌ను అమ్మడం చేయకుండా.. ఇంకా పాఠశాలకు 50 మీటర్ల దూరంలో ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, జంక్ ఫుడ్ అమ్మే షాపులు వుండకూడదని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆహార భద్రత, నాణ్యత నియంత్రణ విభాగం పాఠశాలలకు సర్క్యులర్స్ పంపింది.