Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్నాటక రాష్ట్రంలో చోరీకి గురైన ఆర్టీసీ బస్సు..

Advertiesment
KSRTC
, బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (10:02 IST)
కర్నాటక రాష్ట్రంలో ఒక ఆర్టీసీ బస్సు చోరీకి గురైంది. రాష్ట్రంలోని కలబురిగి జిల్లా చించోలి బస్టాండులో జరిగింది. ఇక్కడ పార్కింగ్ చేసివున్న కేఏ38 ఎఫ్971 అనే నంబరు కలిగిన ఈ బస్సు బీదర్ రెండో డిపోకు చెందినదిగా గుర్తించారు. ఇది ప్రతి రోజూ చించోలి - బీదర్ ప్రాంతాల మధ్య తిరుగుతుంది.
 
ఈ బస్సును గుర్తు తెలియని వ్యక్తి ఒకరు వచ్చి ఈ బస్సును అపహరించాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. మంగళవారం వేకువజామున 3.30 గంటల సమయంలో బస్టాండులోకి వచ్చిన ఓ అగంతకుడు ఈ బస్సను చాకచక్యంగా అపహరించాడు. ఇదంతా బస్టాండులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. 
 
ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చోరీకి గురైన బస్సు కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే, ఈ బస్సు తెలంగాణాలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. ఆ బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఈ బస్సును అపహరించిన దొంగలు.. తెలంగాణాలోని తాండూరు మీదుగా తీసుకెళ్ళినట్టు గుర్తించారు. అయితే, ఈ బస్సును డిపార్ట్‌మెంట్ వారే అపహరించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో.. ఇలా కూడా చేస్తారా... ట్రాఫిక్ సిగ్నల్ బ్యాటరీలు చోరీ