G20 సదస్సు కోసం ఢిల్లీ ముస్తాబవుతోంది. ఢిల్లీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా చింపాజీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. సెప్టెంబర్ 9, 10 తేదీలో ఢిల్లీలో జీ 20 దేశాల కూటమి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు వివిధ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు.
ఇందుకోసం అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ సమావేశాలకు కోతులు అడ్డుగా మారాయి. అందుకే ఢిల్లీ సర్కాకు సుందరీకరణతో పాటు కోతుల్ని తరిమే పనులో పడింది. కోతుల బెడద నుంచి తప్పించుకోవడానికి లంగూర్ కటౌట్‌లు ఏర్పాటు చేశారు.
అలాగే ఈ సమ్మిట్ కోసం కెనడియన్, జపాన్ ప్రధానులు తమ ప్రతినిధులతో బస చేసే న్యూ ఢిల్లీ హోటల్, గదులలో బుల్లెట్ ప్రూఫ్ గాజు, లైవ్ పియానో సంగీతం, వంటలలో మిల్లెట్ల టచ్‌తో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది.
సెప్టెంబరు 9,10 తేదీలలో, G20 సమ్మిట్ జరుగుతుంది. సందర్శకులకు వసతి కల్పించడానికి అనేక హోటళ్ళు రిజర్వు చేయబడ్డాయి. న్యూఢిల్లీలోని లలిత్ హోటల్‌లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా బస చేస్తారు.