Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్యాకుమారిలో వివేకానంద విగ్రహం.. గాజు వంతెన.. సముద్రపు అలలను...?

Advertiesment
Kanyakumari
, బుధవారం, 11 జనవరి 2023 (22:34 IST)
Kanyakumari
కన్యాకుమారిలోని వివేకానంద, తిరువళ్లువర్‌ విగ్రహాల మధ్య గాజు వంతెన నిర్మిస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఉన్న కన్యాకుమారిని భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుండి ప్రతిరోజూ వందలాది మంది పర్యాటకులు సందర్శిస్తారు. 
 
ఈ నేపథ్యంలో వివేకానంద స్మారక మందిరం, తిరువల్లువర్ విగ్రహం మధ్య గ్లాస్ కేజ్ బ్రిడ్జి నిర్మిస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించి ఇందుకోసం 37 కోట్లు కేటాయించింది. 
 
చెన్నైకి చెందిన ఓ ప్రముఖ సంస్థ ఇందుకోసం టెండర్ తీసుకున్నదని, ఈ గ్లాస్ కేజ్ బ్రిడ్జి పొడవు 97 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు ఉంటుందని తమిళనాడు ప్రభుత్వం తెలియజేసింది. ఇతర దేశాల్లో మాదిరిగానే ఈ వంతెన గుండా వెళుతూ సముద్రపు అలలను పర్యాటకులు ఆస్వాదించవచ్చునని చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్పత్తి- సాంకేతిక ఆవిష్కరణలతో భారతీయ ద్విచక్ర ఈవీ మోటర్‌బైక్‌ మార్కెట్‌లో సమూల మార్పులను తీసుకురానున్న మ్యాటర్‌