Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒరిస్సాలో రెండు ముక్కలైన జాతీయ రహదారి వంతెన

bridge
, బుధవారం, 19 జులై 2023 (11:21 IST)
ఒరిస్సా రాష్ట్రంలో ఎన్.హెచ్.16 నంబరుతో ఉండే జాతీయ రహదారిపై నిర్మించిన వంతెన రెండు ముక్కలైంది. ఈ వంతెన కోల్‌‍కతా - చెన్నైలో ప్రాంతాలను కలుపుతుంది. ఈ జాతీయ రహదారిపై నిర్మించిన ఈ వంతెన రెండు ముక్కలైంది. అందులో ఒక భాగం నేలపైకి ఒరిగిపోయింది. ఒరిస్సాలోని జాజ్పుర్ జిల్లాలో రసూల్ పుర్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదాన్ని పసిగట్టిన ఓ ఇద్దరు అటుగా వచ్చే వాహనాలను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఆ మార్గంలో వచ్చే వాహనాలను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. 
 
పోలీసుల కథనం మేరకు.. ఎన్‌హెచ్-16 పై రసూల్‌పూర్ వద్ద రాకపోకలకు వీలుగా రెండు వంతెనలు నిర్మించారు. భువనేశ్వర్ వైపు వెళ్తున్న ఓ బస్సు మంగళవారం ఉదయం అందులోని ఓ వంతెనను దాటింది. ఈ క్రమంలోనే ఆ వంతెన నిర్మాణంలోని ఓ స్పాన్ క్రమంగా పడిపోవడం మొదలైంది. అంతలోనే అది పెద్దఎత్తున శబ్దంతో కిందికి జారిపోయింది. ఇది గుర్తించిన.. ఓ ట్రాక్టర్ డ్రైవర్‌తోపాటు కౌఖాయ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ హోంగార్డు అప్రమత్తమయ్యారు. వెంటనే వంతెనపైకి వాహనాల రాకపోకలను నిలిపేశారు.
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వాహనాలను దారిమళ్లించారు. వంతెన కూలిపోయిన మార్గంలో రాకపోకల కట్టడికి బారికేడ్లు ఏర్పాటుచేశారు. 'భువనేశ్వర్ బస్సు వెళ్లిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ గల ఓ వాహనం కూడా వంతెన దాటింది. ఆ తర్వాత వంతెన కూలిపోయింది. దీంతో మేం ఇతర వాహనాలను బ్రిడ్జిపైకి వెళ్లకుండా ఆపేశాం. స్థానికులు కూడా సహకరించారు' అని హోంగార్డు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్ మహిళ సీమా హైదరాబాద్ .. పాకిస్థాన్ గూఢచారి?