ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఇరువర్గాలు పరస్పరం ఘర్షణకు దిగాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. కుర్చీలను గాలిలోకి ఎగరవేయడం, చాలామంది ఒకరినొకరు కుర్చీలతో కొట్టుకోవడం వీడియోలో కనిపిస్తోంది.
ఈ వీడియోను ఇంటర్నెట్ వినియోగదారులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. అమీనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంగే నవాబ్ పార్క్ ఎదురుగా ఉన్న బుద్ధ లాల్ బద్లు ప్రసాద్ ధర్మశాలలో వివాహ వేడుకలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
శుక్రవారం (ఫిబ్రవరి 9) రాత్రి జనాలు డీజేపై డ్యాన్స్‌లు చేస్తుండగా ఘర్షణ చెలరేగినట్లు సమాచారం. కొంతసేపటికి ఒకరినొకరు కుర్చీలతో కొట్టుకోవడంతో ముగ్గురికి గాయాలయ్యాయి.
రిసెప్షన్‌లో జనం డీజేపై డ్యాన్స్ చేస్తుండగా తోపులాట జరిగింది. మొదట్లో ఇరు వర్గాల వ్యక్తుల మధ్య వాగ్వాదం జరగగా, వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన వారంతా పాల్గొనడంతో అది కాస్త భీకర పోరుగా మారింది.
అతిథుల కోసం ఉంచిన ఎరుపు రంగు ప్లాస్టిక్ కుర్చీలతో ప్రజలు ఒకరినొకరు కొట్టుకోవడం వీడియోలో చూడవచ్చు. ఈ గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇరువర్గాలను శాంతింపజేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించి, ఫిర్యాదులు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం.