Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల వివాహ రిసెప్షన్‌కు క్యూకట్టిన తారాలోకం

Advertiesment
varun lavanya tripati reception
, సోమవారం, 6 నవంబరు 2023 (10:34 IST)
ఇటీవల ఇటలీలో మూడుముళ్ల బంధంతో ఒక్కటైన హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఆదివారం ఎంతో గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ 'ఎన్' కన్వెన్షన్ సెంటరులో ఈ వేడుక జరిగింది. ఈ రిసెప్షన్ కార్యక్రమానికి తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన తారాలోకంతో పాటు అతిరథ మహారథులంతా తరలివచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. తమ శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఈ వివాహ వేడుకకు వచ్చిన వారిలో చిరంజీవి, జయసుధ, వెంకటేశ్, జగపతిబాబు, మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్, ముత్యాల సుబ్బయ్య, అశ్వినీదత్, అలీ, సునీల్, దిల్ రాజు, సుకుమార్, బోయపాటి శ్రీనివాస్, గుణశేఖర్, బెల్లంకొండ సురేశ్, సుమ, బన్నీవాసు, వెంకీ అట్లూరి, చోట కే నాయుడు, జ్ఞానశేఖర్‌తోపాటు పలువురు సినీదర్శకులు, నిర్మాతలు, నటులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ రిసెప్షన్‌‍కు సంబంధించిన ఫొటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
 
కాగా, దాదాపు ఆరేళ్లు ప్రేమలో ఉన్న వరుణ్, లావణ్య పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి వేడుకను ఇటలీలో నవంబరు 1న వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. మెగా, అల్లు కుటుంబాలు, లావణ్య కుటుంబం, హీరో నితిన్ దంపతులు.. ఇలా కొద్దిమంది మాత్రమే వివాహ వేడుకకు హాజరయ్యారు. 
 
తెలుగు చలన చిత్ర పరిశ్రమ వారి కోసం హైదరాబాద్ నగరంలో ఆదివారం ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వరుణ్, లావణ్యలు కలిసి 'మిస్టర్', 'అంతరిక్షం' చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల చిత్రీకరణ సమయంలోనే వారి మధ్య ప్రేమ పుట్టింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడితో అమలా పాల్ కొత్త జీవితం.. సింపుల్‌గా రెండో పెళ్లి