Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజ్యసభలో బీజేపీ సెంచరీ - 1990 తర్వాత 100 మార్క్

Advertiesment
Rajya Sabha
, శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (19:43 IST)
కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో ఒక్కసారిగా బలం పెరిగింది. కీలక బిల్లుల ఆమోదం కోసం భాగస్వామ్య పార్టీలతో పాటు విపక్షాల మద్దతుపై ఆధారపడుతూ వచ్చేది. అయితే, ఇపుడు ఆ పార్టీ బలం ఒక్కసారిగా వందకు చేరింది. 1990 తర్వాత వంద మార్కును చేరిన తొలి పార్టీగా భారతీయ జనతా పార్టీ గుర్తింపు పొందింది. 
 
ఇటీవల జరిగిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో అస్సోం, త్రిపుర, నాగాలాండ్, హిమాచల ప్రదేశ్‌లకు చెందిన ఒక్కో సీటును బీజేపీ కైవసం చేసుకుంది. అలాగే, పంజాబ్ కోటాలో ఐదు సీట్లకు ఎన్నికలు జరుగగా తన ఖాతాలోని సీటును బీజేపీ కోల్పోయింది. 
 
ఈ ఐదు సీట్లు ఆప్ ఖాతాలోపడ్డాయి. పంజాబ్ సీటును కోల్పోయినప్పటికీ నాలుగు రాష్ట్రాల్లో వచ్చిన నాలుగు సీట్లతో కలుకుంటే రాజ్యసభలో బీజేపీ మొత్తం సీట్ల సంఖ్య 100కు చేరింది. అంటే 1999 తర్వాత రాజ్యసభలో మంది సభ్యులు కలిగిన అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ ప్రధాని అవుతారు : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి