ఏపీని అవినీతి ప్రదేశ్, అంధకారప్రదేశ్‌గా మారుస్తున్న గొప్ప వ్యక్తి సీఎం జగన్ అంటూ ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఒకే ఒక్క ఛాన్సు అంటూ ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు.
ఏపీలో కరెంట్ ఛార్జీల పెంపుపై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి స్పందించారు. 2024లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలే పెద్ద షాక్ ఇస్తారని ఆయన కామెంట్ చేశారు. ప్రస్తుతం ఫ్యాన్ స్విచ్ వేసే పరిస్థితిలో సామాన్య ప్రజలు లేరన్నారు.
ఇప్పటికైనా తాడేపల్లి ప్యాలెస్ వదిలి సీఎం జగన్ బయటకు రావాలన్నారు. వారం రోజుల పాటు సీఎం జగన్ బయటకు వచ్చి ప్రజలతో కలిసి గుడిసెల మధ్య నివసించాలని సవాల్ చేశారు. సామాన్యుల మధ్య జీవిస్తే ప్రజల కష్టాలేంటో సీఎం జగన్‌కు తెలుస్తాయని హితవు పలికారు.