భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతికేరంగా నినాదాల చేస్తూ ర్యాలీలు నిర్వహించాయి. దుకాణదారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసేశారు. ఏపీలో ఈ మధ్యాహ్నం వరకు బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
కడప జిల్లా వ్యాప్తంగా 8 డిపోల పరిధిలో తొమ్మిది వందల బస్సు సర్వీసులు డిపోలకే పరిమితమయ్యాయి. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద నిరసన తెలియజేశారు. విశాఖ పాడేరు ఏజెన్సీలోని 11 మండలాల్లో బంద్ ప్రభావం కనబడింది. దేశంలో ముంబై, ఢిల్లీల్లో రైల్వా ట్రాక్‌లు, హైవేలన్నీ మూతపడ్డాయి.