Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

నిత్యానంద మృతి వార్తలు - వాస్తవం ఏంటి? కైలాసం నుంచి అధికార ప్రకటన!

Advertiesment
Nityananda swami

ఠాగూర్

, బుధవారం, 2 ఏప్రియల్ 2025 (12:19 IST)
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మృతి చెందారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. హిందూ ధర్మ పరిరక్షణ కోసం తన ప్రాణాలు త్యాగం చేశాడంటూ, నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ తమిళ మీడియాతో చెప్పిన వ్యాఖ్యలు ఈ వార్తలు మరింత ఊపునిచ్చాయి. అయితే, వార్తలపై కైలాస దేశం నుంచి అధికారక ప్రకటన విడుదలైంది. 
 
తన మృతిపై వస్తున్న వదంతులను ఖండించిన నిత్యానంద, తాను పూర్తి సురక్షితంగా ఉన్నానని, జీవ సమాధిలో ఉన్నానని ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆయన భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. నిత్యానంద ప్రస్తుతం తన సొంత దీపం కైలాసలో ఉంటూ, తన ధార్మిక కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్టు సమాచారం. 
 
2022లోనూ నిత్యానంద మృతి చెందారని వస్తున్న వార్తలను ఆయన స్వయంగా ఖండించారు. తాను చనిపోలేదని, జీవ సమాధిలో ఉన్నానని  ప్రకటించారు. ఇక ఆయన చివరిసారిగా 2022 మహాశివరాత్రి రోజున యూట్యూబ్‌లో ప్రత్యక్షమయ్యారు. 
 
తాజా పరిణామాల నేపథ్యంలో నిత్యానంద భక్తులకు ఓ ప్రకటన విడుదల చేయడం ద్వారా వారి ఆందోళన తొలగించారని చెప్పవచ్చు. ఆయన ఆరోగ్యంగా కైలసంలో ఉంటూ తన మిషన్‌ను కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈపీఎఫ్‌వో ఆటో సెటిల్‌మెంట్ అడ్వాన్స్ క్లెయిమ్.. రూ.1లక్ష నుంచి రూ.5లక్షలకు పెంపు