Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు ఆదేశం

nirmala sitharaman

ఠాగూర్

, శనివారం, 28 సెప్టెంబరు 2024 (08:45 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌పై కేసు నమోదుకు బెంగుళూరు కోర్టు ఆదేశించింది. పార్టీ నిధుల కోసం ఆమె దేశంలోని పలువురు పారిశ్రామికవేత్తల నుంచి బెదిరించి, వారి నుంచి పెద్ద మొత్తంలో నగదును ఎలక్టోరల్ బాండ్ల్ పేరిట బీజేపీ పార్టీ అధికారిక ఖాతాలకు బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు జనాధికార సంఘర్ష పరిషత్ సంస్థకు చెందిన ఆదర్శ్ అయ్యర్ గతంలో ఆరోపించారు. ఇవి ముమ్మాటికీ నిజమనే పేర్కొంటూ ఆయన తిలక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాలా సీతామన్‌పై వెంటనే కేసు నమోదు చేయాలని బెంగుళూరులోని తిలక్ నగర్ ఠాణా పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, ఆదర్శ్ అయ్యర్ నిర్మలపై కేసు నమోదు చేయాలని కోరగా వారు పట్టించుకోకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే.. కేంద్రమంత్రి నిర్మలమ్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే, తదుపరి విచారణను వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పటికైనా పోలీసులు కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేస్తారో లేదో వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ సంతకం చేయరు.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: భూమన సవాల్