మందుబాబులను ఉద్దేశించి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మద్యం సేవించేవారంతా మహా పాపులతో ఆయన పోల్చారు. పైగా కల్తీ సారా మృతుల పట్ల ప్రభుత్వం బాధ్యత తీసుకోదని ఆయన వ్యాఖ్యానించారు.
బీహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలవుతుంది. దీంతో కల్తీ సారా, కల్తీ మద్యం ఏరులై పారుతుంది. ఈ కల్తీ మందును సేవించే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. మందు తాగేవాళ్లంతా మహా పాపులంటూ వ్యాఖ్యానించారు.
కల్తీ మద్యం, కల్తీ సారా తాగడం వల్ల మృతి చెందే వారి పట్ల ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోదని ఆయన స్పష్టం చేశారు. అలాగే వారి కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం అందజేయబోదని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ కూడా మద్యం సేవించడాన్ని వ్యతిరేకించారని, ఆయన సిద్ధాంతాలను పట్టించుకోకుండా మందు తాగుతున్నారని, ఇలాంటి వారంతా మహా పాపులేనని స్పష్టం చేశారు.