Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పొరపాటున తనను తాను కాల్చుకున్న ఎయిర్‌ఫోర్స్ వైస్ చీఫ్

భారత ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్, ఎయిర్ మార్షల్ శిరీష్ డియో పొరపాటున తనను తాను కాల్చుకున్నారు. తన తొడలోకి తానే కాల్చుకున్నారు. దీంతో ఆయనను హుటాహుటిన ఢిల్లీలోని ఆర్ఆర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

Advertiesment
Air vice chief SB Deo accidentally shoots self in thigh
, గురువారం, 27 సెప్టెంబరు 2018 (13:33 IST)
భారత ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్, ఎయిర్ మార్షల్ శిరీష్ డియో పొరపాటున తనను తాను కాల్చుకున్నారు. తన తొడలోకి తానే కాల్చుకున్నారు. దీంతో ఆయనను హుటాహుటిన ఢిల్లీలోని ఆర్ఆర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆయనకు వైద్యులు సర్జరీ చేసి తొడ ఎముకను సెట్ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది.
 
ఈయన గత జూలై నెలలో ఎయిర్ వైస్ చీఫ్‌గా డియో బాధ్యతలను స్వీకరించారు. ఎయిర్ చీఫ్‌గా బీఎస్ ధనోవా బాధ్యతలను స్వీకరించడంతో... అప్పటిదాకా ఆయన నిర్వహించిన వైస్ చీఫ్ పదవిని శిరీష్ చేపట్టారు. 1979 జూన్ 15న ఫైటర్ పైలట్‌గా శిరీష్ ఎయిర్ ఫోర్స్‌లో చేరి సేవలు అందిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్రెండ్‌ ప్రియురాలిపై కన్నేసిన దోస్త్.. రెండు హత్యలకు కారణమైన ఆ మహిళ...