Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుక్కకు ఆధార్ కార్డు.. నెలనెలా క్రమం తప్పకుండా రేషన్...

గతంలో దేవుళ్ళకు జంతువులు, పక్షులకు ఆధార్ కార్డులు జారీచేశారు. చివరకు కొత్తిమీర కట్టకు కూడా ఈ కార్డును ఇచ్చారు. ఇలాంటి గతంలో అనేక రకాలైన వార్తలు కూడా వచ్చాయి. అలాగే, జంతువులు, పక్షుల పేరిట కొందరు ఆకతాయ

Advertiesment
కుక్కకు ఆధార్ కార్డు.. నెలనెలా క్రమం తప్పకుండా రేషన్...
, గురువారం, 27 సెప్టెంబరు 2018 (13:03 IST)
గతంలో దేవుళ్ళకు జంతువులు, పక్షులకు ఆధార్ కార్డులు జారీచేశారు. చివరకు కొత్తిమీర కట్టకు కూడా ఈ కార్డును ఇచ్చారు. ఇలాంటి గతంలో అనేక రకాలైన వార్తలు కూడా వచ్చాయి. అలాగే, జంతువులు, పక్షుల పేరిట కొందరు ఆకతాయిలు ఓటర్ కార్డులు కూడా ఇచ్చారు.
 
ఇపుడు ఓ కుక్కకు ఆధార్ కార్డును ఇచ్చారు. పైగా, నంబరును, కార్డులోని పేరును రేషన్ కార్డులో కూడా చేర్చారు. ఆ తర్వాత రేషన్ కూడా నెలనెలా క్రమం తప్పకుండా ఇస్తున్నారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ధర్ జిల్లాలో జరిగింది. దీంతో అధికారులు పనితీరు మరోసారి బయటపడింది.
 
నర్సింగ్ బోదార్ ఫ్యామిలీ ధర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో నివసిస్తోంది. వీరి కుటుంబంలో ముగ్గురు సభ్యులున్నారు. నర్సింగ్, ఆయన భార్య, వీరి కుమారుడు రాజు. నర్సింగ్ ప్రతి వారం రేషన్ షాపుకు వెళ్లి సరుకులు తీసుకునేవాడు. ఐతే పీడీఎస్ అధికారులు ఇటీవల కొత్త నిబంధన తీసుకొచ్చారు. 
 
రేషన్ సరుకులు తీసుకోవాలంటే ఆధార్ కార్డు చూపించాలన్న నిబంధనను తెచ్చారు. ఈ క్రమంలోనే ఓ సారి నర్సింగ్ రేషన్ షాపుకు వెళ్లగా.. ముగ్గురు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు చూపించమన్నాడు రేషన్ సిబ్బంది. కానీ నర్సింగ్.. అతనిది, భార్య ఆధార్ కార్డులను మాత్రమే చూపించాడు. మీ కుమారుడు రాజుకు ఆధార్ కార్డు లేదా అన్ని ప్రశ్నిస్తే.. నీళ్లు నమిలాడు.
 
రేషన్ షాపు సేల్స్‌మ్యాన్ గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. అసలు వారికి కుమారుడే లేడని.. రాజు అంటే వాళ్లింట్లో ఉండే పెంపుడు కుక్క అని తేలింది. అంటే ఇన్నాళ్లు కుక్క పేరిట రేషన్ సరుకులు తీసుకున్నారని అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐటి దాడులను రేవంత్ రెడ్డి ముందే ఊహించారా?