వేసవి ఎండలు క్రమంగా ముదురుతున్నాయి. సాయంకాలం అట్లా సేదతీరేందుకు చాలామంది నదులు, సరస్సులు, సముద్రపు తీరాల వైపు వెళ్తుంటారు. అక్కడ చల్లని గాలుల మధ్య కాస్త కాలం గడుపుతుంటారు. ఐతే అలాంటి సమయాలలో కొంతమంది నీటిలో ఈతకొట్టేందుకు ఉత్సుకత చూపిస్తుంటారు. ఆ ఉత్సుకతే ఓ మహిళా వైద్యురాలి ప్రాణం తీసింది.
పూర్తి వివరాలను చూస్తే... హైదరాబాద్ నగరంలోని నాంపల్లికి చెందిన మహిళా వైద్యురాలు అనన్య రామోహన్, ఆమె స్నేహితురాళ్లు కొంతమంది కర్నాటక లోని గంగావతి జిల్లాలోని సనాపూర్ గెస్ట్ హౌసులో దిగారు.
అనంతరం వారు తుంగభద్ర నది వద్ద నీటిలో ఈత కొట్టాలని నిర్ణయించుకున్నారు. అలా అనన్య అవతలవైపు 25 అడుగులు ఎత్తున్న గుట్టపైనుంచి నదిలో ఈత కొట్టేందుకు దూకేసారు. ఆమె అలా దూకి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో నదిలో అలలు రావడంతో ఆమె రాలేక ఇబ్బందిపడ్డారు. దీనితో ఆమెను రక్షించేందుకు ఆమె ఫ్రెండ్స్ ప్రయత్నించినప్పటికీ ఆమె నదిలో కొట్టుకుపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఐతే అప్పటికే అనన్య గల్లంతయ్యారు. సరదా కోసం వచ్చి స్నేహితురాలును పోగొట్టుకున్నామంటూ ఆమె స్నేహితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.