Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 5 March 2025
webdunia

భార్యాభర్తలిద్దరూ హ్యాపీగా చుక్కేశారు.. ఇంతలో ఓ ఫోన్ కాల్.. అంతే సీన్ రివర్స్!?

Advertiesment
భార్యాభర్తలిద్దరూ హ్యాపీగా చుక్కేశారు.. ఇంతలో ఓ ఫోన్ కాల్.. అంతే సీన్ రివర్స్!?
, మంగళవారం, 15 జూన్ 2021 (17:05 IST)
భార్యాభర్తలిద్దరూ కలిసి హ్యాపీగా మద్యం సేవించారు. కానీ భార్యకు వచ్చిన ఫోన్ కాల్ కొంపముంచింది. ఆ ఫోన్‌కాల్‌తో సీన్ మొత్తం మారిపోయింది. అప్పటికే భార్యపై తీవ్ర అనుమానం పెంచుకున్న భర్త ఆమెపై క్షణికావేశంలో కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయాలపాలైన ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. యూపీలోని మీరట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 
 
పూర్తి వివరాల్లోకి వెళితే.. మీరట్‌లోని బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న వికాస్ అలియాస్ విక్కీకి, ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతానికి చెందిన నేహాకు గతేడాది వివాహమైంది. పెళ్లయిన కొన్నాళ్లకు భార్యపై వికాస్ అనుమానం పెంచుకున్నాడు. తాను అనుమానపడుతున్న విషయం భార్యకు తెలియకుండా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలోనే.. నేహా కొన్ని నెలలుగా గంటల తరబడి ఫోన్ మాట్లాడటం, తెలియని ఫోన్ నంబర్ల నుంచి కాల్స్ రావడాన్ని వికాస్ గమనించాడు. దీంతో.. ఈ పరిణామాల మూలంగా నేహాపై వికాస్ అనుమానం మరింత బలపడింది. 
 
భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతుందని భావించిన వికాస్ మద్యానికి అలవాటుపడ్డాడు. అప్పుడప్పుడు భార్య నేహాతో కలిసి కూడా తాగేవాడు. ఆమె కూడా భర్తతో కలిసి మద్యం సేవించేది. అంతలా ఎవరు కాల్స్ చేస్తున్నారని నేహాను కొన్ని సందర్భాల్లో వికాస్ నిలదీశాడు. అప్పటి నుంచి భర్తతో నేహా అంటీముట్టనట్టుగా ఉండేది. ఘటన జరిగిన రోజున భార్యకు వచ్చిన ఫోన్ కాల్‌తో ఆగ్రహానికి గురైన భర్త క్షణికావేశంలో కూరగాయలు కోసే కత్తితో భార్యపై దాడికి పాల్పడ్డాడు. 
 
ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. పై నుంచి పెద్దపెద్దగా కేకలు వినిపించడంతో అప్పుడే బయటకు వెళ్లి వచ్చిన వికాస్ తల్లి పైకెళ్లి చూసేసరికి నేహా రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో.. వికాస్‌ను వారించిన అతని తల్లి కోడలిని ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం నేహా పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండోర్ మొక్కకు భారీ ధర.. ఏకంగా రూ.14లక్షలు