Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టూవీలర్ ఓవర్.. ఆటోలో ప్రేమ జంట రొమాన్స్.. వీడియో వైరల్

Advertiesment
Auto love

సెల్వి

, శుక్రవారం, 7 నవంబరు 2025 (17:25 IST)
Auto love
కొందరు యువతీయువకులు పబ్లిక్ ప్రదేశాల్లోనే రెచ్చిపోతున్నారు. చుట్టుపక్కల ఎవరు ఉన్నారనేది కూడా పట్టించుకోకుండా రొమాన్స్ చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల బైకులపై అడ్డదిడ్డంగా కూర్చుని రొమాన్స్ చేస్తూ కనిపించిన వీడియోలు నెట్టింట వైరల్ అయిన దాఖలాలు వున్నాయి. 
 
ఈ వీడియోలను చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఇలా టూవీలర్స్‌పై రొమాన్స్ చాలదన్నట్లు.. ఆటోలో కూడా రొమాన్స్ చేస్తామని ఓ ప్రేమ జంట రోడ్డుపై పడింది.
 
ఆటో నడుపుతూ ఓ ప్రేమ జంట హద్దుమీరింది. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవింగ్ సీటులో యువతిని తన ఎదురుగా కూర్చోబెట్టుకొని.. ఆటో డ్రైవర్ రొమాన్స్ చేస్తూ ఆటో డ్రైవర్ నడిపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోను తీసిన వారంతా ప్రేమ జంట తీరుపై తిట్టిపోస్తున్నారు. ఇలాంటి వారి వల్లే ప్రమాదాలు జరుగుతాయని.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీ ప్రియుడితో చల్లగా నూరేళ్లు వర్థిల్లు నా శ్రీమతి: ప్రియుడితో పెళ్లి చేసి భర్త సూసైడ్