Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

9 మంది దొంగలు, ఒక్కడే కమాండర్: టీవీకె విజయ్

Advertiesment
TVK Vijay

ఐవీఆర్

, గురువారం, 21 ఆగస్టు 2025 (22:39 IST)
తమిళనాడు మధురైలో జరిగిన మానాడు సభలో జరిగిన సమావేశంలో చైర్మన్ విజయ్ మాట్లాడుతూ, ఎప్పటిలాగే స్వచ్ఛంద సేవకులకు ఒక చిన్న కథ చెప్పాడు. ఒక దేశంలో ఒక రాజు తనకు తోడుగా ఉండే జనరల్ కోసం వెతుకుతున్నాడు. దానికి సరైన అర్హత ఉన్న 10 మందిని ఎంపిక చేసాడు. రాజు 10 మందికీ వరి విత్తనాలు ఇచ్చాడు, వారందరినీ పరీక్షించడానికి అలా చేసాడు. అతను వారికి 3 నెలల సమయం ఇస్తాడు. వరిని బాగా పెంచి తిరిగి తీసుకురావాలని చెబుతాడు. 3 నెలల పాటు అందరూ వరిని పెంచారు.
 
ఒకరు వరిని మనిషి ఎత్తుకు పెంచారు. మరొకరు దానిని భుజం ఎత్తుకు పెంచారు. ఈ విధంగా 9 మందిలో ప్రతి ఒక్కరూ వరిని ఎత్తుకు పెంచారు. కానీ ఒకరు మాత్రమే ఖాళీ చేతులతో వచ్చాడు. నువ్వు వరిని ఎందుకు తీసుకురాలేదు అని అడిగాడు. దీనికి అతను, నేను కూడా దానికి నీళ్ళు పోసాను.. నేను దానికి ఎరువులు వేసాను. నేను ఏమి చేసినా అది పెరగలేదు రాజా అన్నాడు. వెంటనే రాజు అతడిని కౌగిలించుకుని, ఇక నుండి, నువ్వే నా కమాండర్ అన్నాడు.
 
ఎందుకంటే రాజు 10 మందికి చెడిపోయిన వడ్లు ఇచ్చాడు. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ మొలకెత్తవు. ఆ 9 మంది కూడా రాజు ఇచ్చినవి మొలకెత్తకపోయేసరికి ఎవరికివారు వేరేవి తీసుకుని వచ్చి విత్తారు. అలా విత్తడం ద్వారా రాజును, ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి సత్యాన్ని బయటపెట్టాడు.
 
ఒక దేశానికి ప్రతిభ ఎంత ముఖ్యమో, సత్యం మరియు నిజాయితీ కూడా అంతే ముఖ్యమైనవి. ఇప్పుడు, మీరందరూ రాజులు. మీ కమాండర్ ఎవరు? అంటూ నటడు విజయ్ ప్రశ్నించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాంకేతిక రంగంలో ఉన్న మహిళలను శక్తివంతం చేసేందుకు అమెజాన్ ప్రోగ్రామ్ 500 స్కాలర్‌షిప్‌లు