Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుజరాత్‌లో చిన్నారి బలి.. అత్యాచారం చేసి చంపేశారా?

ఉన్నావో, కథువా ఘటనలు మరువకముందే మరో చిన్నారి బలైపోయింది. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో సిరామిక్ టైల్స్ ఫ్యాక్టరీలో పనిచేసేందుకు కొన్ని కుటుం

Advertiesment
గుజరాత్‌లో చిన్నారి బలి.. అత్యాచారం చేసి చంపేశారా?
, శుక్రవారం, 4 మే 2018 (13:15 IST)
ఉన్నావో, కథువా ఘటనలు మరువకముందే మరో చిన్నారి బలైపోయింది. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో సిరామిక్ టైల్స్ ఫ్యాక్టరీలో పనిచేసేందుకు కొన్ని కుటుంబాలు వలస వచ్చాయి. ఆ కుటుంబాల్లో ఒక కుటుంబానికి చెందిన రెండేళ్ల చిన్నారి.. బుధవారం కనిపించకుండా పోయింది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జెట్పార్ రోడ్డుకు సమీపంలోని ఓ కాలువ వద్ద చిన్నారి మృత దేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టమ్ రిపోర్టు వచ్చిన తర్వాతే చిన్నారి మృతికి గల కారణాలు కచ్చితంగా చెప్పగలమని పోలీసులు చెప్తున్నారు. అయితే చిన్నారిపై అత్యాచారం జరిగివుంటుందని స్థానికులు, కుటుంబీకులు మండిపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దాచేపల్లి రేప్ నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య.. చెట్టుకు ఉరివేసుకునీ..